విశ్వకల్యాణం కోసం కేసీఆర్.. తెలంగాణను ముంచేందుకు చంద్రబాబు!: కేటీఆర్

  • బ్రాహ్మణుల గురించి కేసీఆర్ కు తెలిసినంత మరే సీఎంకు తెలియదు
  • పేద బ్రాహ్మణులకు అండగా ఉంటాం
  • దేవాలయాలకు 100 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ ది
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. బ్రాహ్మణుల స్థితిగతుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంతగా మరే ఇతర ముఖ్యమంత్రికి తెలియదని చెప్పారు. యావత్ దేశంలో ట్రెజరీ నుంచి పురోహితులకు జీతాలు ఇస్తున్నది కేవలం తెలంగాణలో మాత్రమేనని తెలిపారు.

బ్రాహ్మణుల కోసం 17 పథకాలను ప్లాన్ చేశామని... ప్రస్తుతానికి 5 పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. దేవాలయాలను కేసీఆర్ లా మరే ముఖ్యమంత్రి అభివృద్ధి చేయలేదని అన్నారు. దేవాలయాల కోసం రూ. 100 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ ది అని చెప్పారు. విశ్వకల్యాణం కోసం కేసీఆర్ అయుత చండీయాగం చేస్తే... తెలంగాణను ముంచే ప్రయత్నాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాదులో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, కేటీఆర్ పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
KTR
kcr
Chandrababu
TRS
brahmin

More Telugu News